కరోనా ప్రభావంతో మార్కెట్లో మాస్కులు, థర్మామీటర్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడం వల్ల అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయితే శానిటైజర్, గ్లౌజులకు డిమాండ్ పెరిగినా అవి అందుబాటులోనే ఉన్నాయని దుకాణ యజమానులు చెబుతున్నారు. థర్మామీటర్లు చైనా నుంచి రావాల్సి ఉన్నందున మార్కెట్లో లభించడం లేదు.
మరోవైపు దీన్ని అదునుగా చూసుకుని నకిలీలు మార్కెట్లోకి రావటం వల్ల ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ అధికారులు సంబంధిత దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, థర్మామీటర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.