కరోనా వైరస్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ఔషదనియంత్రణ పరిపాలనాధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల మాస్కులు ఔషదాశాలల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధిక ధరలకు మాస్కులను విక్రయిస్తున్న మందులు షాపులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ బారిన పడినవారికి ఆరోగ్యశ్రీ తరపున ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డీజీ స్పష్టం చేశారు.
ఇదీచదవండి