ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను తోలుబొమ్మలు చేయడమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పే అధికార వికేంద్రీకరణా.. అని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నిరంకుశ పాలనపై మండిపడ్డారు.
"హైకోర్టు రద్దు చేసిన జీవో నంబర్ 2ను సవరణలతో తిరిగి తీసుకొస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం దుర్మార్గం. గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని కోర్టు తప్పపట్టినా పాలకులు తీరు మార్చుకోరా. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా మార్చాలని చూస్తున్నారు. ప్రభుత్వ విధానాలను 168 సార్లకుపైగా న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా మార్పురావట్లేదు. సీఎం నియంతృత్వ ధోరణిని అడ్డుకుంటాం" అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు: పయ్యావుల