ETV Bharat / city

SEXUAL HARASSMENT ON TRAINEE SI: మహిళా ట్రైనీ ఎస్​ఐపై వేధింపులు..ఎస్ఐపై సస్పెన్షన్‌ వేటు - తెలంగాణ నేరవార్తలు

తెలంగాణలోని మహబూబూబాద్​ జిల్లా మరిపెడ ఎస్​ఐపై సస్పెన్షన్​ వేటు పడింది. మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్​ఐ శ్రీనివాస్‌ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

author img

By

Published : Aug 3, 2021, 8:36 PM IST

తెలంగాణలోని మహబూబూబాద్​ జిల్లా మరిపెడ ఎస్​ఐపై సస్పెన్షన్​ వేటు పడింది. మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్​ఐ శ్రీనివాస్‌ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారాయత్నానికి (SI RAPE ATTEMPT) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్సై.. వరంగల్ పోలీస్ కమిషనర్‌ తరుణ్‌ జోషికి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. సోమవారం రాత్రి అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్సై ఫిర్యాదు చేశారు.

మహిళా కాంగ్రెస్​ ఆగ్రహం..

తెలంగాణలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. దళిత ట్రైనీ ఎస్‌ఐపై.. అదే స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ అత్యాచారానికి యత్నించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు అంటున్న సీఎం కేసీఆర్ ఈ ఘటనతో సిగ్గుపడాలన్నారు. ఘటనకు పాల్పడిన వారిపై వరంగల్‌ పోలీస్​ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. మహిళల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి తమకు డీజీపీ అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు.

దళితుల కోసం చట్టాలు చేయండి..

మరిపెడలో ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన ఎస్​ఐ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహం ముందు దళిత సంఘాలు ధర్నా చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మరియమ్మ ఘటన మరవకముందే.. ఓ ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడికి యత్నించడం దారుణమన్నారు. దళితుల హక్కులు కాపాడేందుకు చట్టాలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి:

Sajjala: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.