ETV Bharat / city

MANGO TREES CUTTING: నూజివీడు మామిడిచెట్ల నరికివేత.. కారణం అదేనంట..! - కృష్ణా జిల్లా తాజా వార్తలు

MANGO TREES CUTTING: ఆ ప్రాంతం పసందైన మామిడిపండ్ల నెలవు..! కాసులు కురిపించే కమ్మని రసాలకు నిలయం..!ఎన్నో ఏళ్ల నుంచి సాగుచేస్తున్న ఉద్యాన పంటకు ప్రధాన కేంద్రం..! విదేశాలకు సైతం ఎగుమతి చేసేంత దిగుబడి వచ్చే ప్రదేశం..! కానీ.... అక్కడ ఈ పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది..! పెంచిన చేతులతోనే చెట్లు నరికేస్తున్నారు రైతులు..! ఎందుకు తొలగిస్తున్నట్లు..? కారణాలేంటో ఓసారి చూద్దాం.

MANGO TREES CUTTING
MANGO TREES CUTTING
author img

By

Published : Dec 16, 2021, 7:05 PM IST

నూజివీడు పరిధిలో మామిడిచెట్లను నరికేస్తున్న రైతులు

MANGO TREES CUTTING: పండ్లలో రారాజు అదే. బంగారం రంగులో నోరూరించే తీపితో... ప్రత్యేకంగా నిలిచే పండు. అందరూ ఇష్టపడే అమృతం లాంటి ఫలం మామిడి. ఈ పళ్లను పండించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది నూజివీడు. ఈ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రుచికరమైన మామిడి పండ్లే. అద్భుతమైన రుచులతో కూడిన మామిడిని అందిస్తూ.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతమిది. అయితే.. ఇక్కడ మామిడికి కాలం చెల్లిందంటున్నారు నూజివీడు రైతులు. ఎన్నో ఏళ్లుగా ఉద్యానవన పంటగా మామిడిని సాగు చేస్తున్న రైతులు.. ప్రస్తుతం పెద్ద చెట్లను తొలగిస్తున్నారు.

చెట్ల వయసు ఎక్కువ కావడం వల్ల దిగుబడి తగ్గడం.. పండ్ల కోత కష్టాలు.. వంటివి చెట్ల కొట్టివేతకు కారణాలుగా చెబుతున్నారు రైతులు. నష్టమేనని తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో కొన్నింటిని తొలగించి.. ఆ స్థానంలో మళ్లీ కొత్తగా నాటుతామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

PATTABHI ON SKILL DEVELOPMENT : స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో.. అది అవాస్తవం: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.