కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్ల ఎత్తుకు పెంచటానికి చేస్తున్న ప్రయత్నం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ఆందోళన వ్యక్తం చేసారు. సాగునీటి వ్యవస్థలపై తీవ్రమైన దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉందన్నారు. సుప్రీం కోర్టు సూచించిన 519 మీటర్లకు బదులుగా 524 మీటర్ల ఎత్తుకు నిర్మించి అదనంగా 130 నుంచి 160 టీఎంసీల నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటిపై నిలచి డ్యామ్ ఎత్తును పెంచకుండా ఉద్యమాన్ని చేపట్టాలని సూచించారు.
'ఆల్మట్టి డ్యామ్ పెంపుతో తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం' - కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్ల ఎత్తుకు పెంచటానికి ప్రయత్నం చేస్తోందని తెదేపానేత మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేసారు. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయని ఆయన అన్నారు.