ETV Bharat / city

సీఎం పేషీ పేరుతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్!

author img

By

Published : Feb 2, 2021, 12:36 PM IST

సైబర్ మోసాలతో మోసగించే నేరగాళ్లు కొందరైతే.. ముఖ్య వ్యక్తుల పేర్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడేవారు మరికొందరు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రాకేష్.. సీఎం పేషీ పేరుతో మోసాలకు పాల్పడుతూ.. విజయవాడ సౌత్ జోన్​లోని గన్నవరపుపేట పోలీసులకు చిక్కాడు.

man was arrested for cheating people in name of cm secretary
సీఎం పేషీ పేరుతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్

‘హలో.. నేను ప్రదీప్‌. సీఎం పేషీ ఎకౌంట్స్‌ సెక్షన్‌ నుంచి మాట్లాడుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలకు కర్టెన్లు, వాల్‌ పేపర్లు కావాలి. వాటికి టెండర్‌ వేయాలి.. మీకు వెండర్‌ కోడ్‌ ఉందా? లేకపోతే రూ.20వేలు కట్టండి. మీకు వెండర్‌ కోడ్‌ ఇప్పిస్తా..’ అంటూ ఓ మోసగాడు గవర్నర్‌పేటకు చెందిన తొండెపు చంద్రశేఖర్‌ను బురిడీ కొట్టించాడు. నమ్మించి రూ.40 వేల మేర టోకరా వేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తొండెపు చంద్రశేఖర్‌ నగరంలోని కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్డులో ‘ప్యారడైజ్‌ ఫర్నిషింగ్స్‌’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.

జనవరి 27వ తేదీ సాయంత్రం ఆయనకు ఒక ఫోన్‌ వచ్చింది. ట్రూ కాలర్‌లో ప్రదీప్‌, సీఎం పేషీ అకౌంట్స్‌ అని రావటంతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు కర్టెన్లు, వాల్‌ పేపర్లు కావాలని, దానికి టెండర్‌ వేయాలని అవతలి వ్యక్తి అన్నాడు. ఇందు కోసం వెండర్‌ కోడ్‌ కావాలని, దాన్ని ఎలా తీసుకోవాలో సురేష్‌ అనే వ్యక్తి ఫోన్‌ నెంబరు ఇచ్చి అతడితో మాట్లాడాలని చెప్పారు. సురేష్‌కు ఫోన్‌ చేయగా.. వెండర్‌ కోడ్‌ నిమిత్తం ఏడాదికి రూ.16 వేలు, 5 ఏళ్లకు అయితే రూ.20వేలు బ్యాంకులో డీడీ తీయాలని సూచించాడు.

బ్యాంకు వేళలు ముగిశాయని, ఇంకా ఒక్క రోజే గడువు ఉందని చెప్పి వెండర్‌ కోడ్‌ నిమిత్తం ఒక ఖాతా నెంబరు చెప్పి రూ.20వేలు వేయాలని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్‌.. గత నెల 28న ఆన్‌లైన్‌ ద్వారా రూ.20వేలు చెల్లించాడు. వెండర్‌ కోడ్‌ అడగ్గా.. సమయం అయిపోయిందని, కోడ్‌ కావాలంటే మళ్లీ డబ్బులు కట్టాలని సురేష్‌ చెప్పాడు. అంతకు ముందు కట్టిన డబ్బులు తిరిగి వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుందని చెప్పటంతో మళ్లీ రూ.20వేలు కట్టారు. వెండర్‌ కోడ్‌ వచ్చేస్తుందని చెప్పినా.. తర్వాత నుంచి సురేష్‌ ఫోన్‌ పనిచేయటం లేదు. మోసపోయినట్లు గ్రహించిన చంద్రశేఖర్‌.. గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన రాకేష్​పై.. పెనమలూరు, పటమట, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే పలు కేసులు పెండింగ్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాంట్రాక్ట్ లు ఇప్పిస్తామని.. నగదు చెల్లించమని ఎవరైనా ఫోన్ చేస్తే ముందుగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

పూర్వ, ప్రస్తుత సీఎస్‌లకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.