దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు బలహీనపడటంతో ఈశాన్య రుతుపవనాల దిగువ ట్రోపోస్పియరిక్ స్థాయిలో వీస్తున్నాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతీ తురుపవనాలు తిరోగమించటంతో.. చాలా చోట్ల వర్షపాతం తగ్గిందని వెల్లడించింది. ఆగ్నేయ భారత్లో.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపిస్తోందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో ఆగ్నేయ- దక్షిణ మధ్య బంగాళాఖాతంలో.. రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కారణంగా ఇవాళ రేపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు.. చాలా చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. రాయలసీమలో సైతం ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇదీ చదవండి: Coal storage : 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలపై జెన్‌కో దృష్టి