కరోనా సమయంలో జీవితాలను ఫణంగా పెట్టి అంగన్వాడీ కార్యకర్తలు.. ప్రజలకు అండగా నిలిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కొనియాడారు. మహిళలు, పిల్లల పోషణ మెరుగుపరిచేందుకు ఇంటింటికీ వెళ్లి వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
భారత ప్రభుత్వం 50 లక్షల రూపాయల బీమాను ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద హెల్త్ కేర్ వర్కర్లకు అందిస్తోందన్న లోకేశ్... అంగన్ వాడీ వర్కర్లు ఈ జాబితాలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అంగన్వాడీ వర్కర్లకు ఈ బీమా అందేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి: