LOKESH ON TIRUMALA: తిరుమల పవిత్రతను పక్కా ప్రణాళికతో వైకాపా ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా జగన్ రెడ్డి మార్చేశారని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు స్థానిక వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు.. తనకు గది కేటాయించలేదంటూ.. తితిదే ఉద్యోగి వెంకటరత్నంపై దాడి చేశాడని మండిపడ్డారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించలేకపోవడం తితిదే, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తితిదే ఉద్యోగిపై దాడిచేసిన ఎమ్మెల్యే అనుచరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారవృతం కాకుండా చూడాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
-
ఇప్పుడు ఏకంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదు అంటూ టిటిడి ఉద్యోగిని దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేసాడు. టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(2/3)
— Lokesh Nara (@naralokesh) June 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇప్పుడు ఏకంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదు అంటూ టిటిడి ఉద్యోగిని దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేసాడు. టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(2/3)
— Lokesh Nara (@naralokesh) June 9, 2022ఇప్పుడు ఏకంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదు అంటూ టిటిడి ఉద్యోగిని దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేసాడు. టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(2/3)
— Lokesh Nara (@naralokesh) June 9, 2022
ఇవీ చదవండి: