తెదేపా నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి సీఎం జగన్ ఆనందిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టును ఖండిస్తున్నామన్న ఆయన..మహిళలకు భద్రత కల్పించాలనే చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది తెదేపా నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. సీఎం తన నియోజకవర్గ మహిళలకే రక్షణ కల్పించలేకపోతున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి