ETV Bharat / city

TDP on YSRCP: 'కల్తీసారా తాగి 26 మంది చనిపోతే.. ప్రభుత్వంలో కనీస చలనం లేదు' - కల్తీసారా మృతుల విషయంలో వైకాపాపై తెదేపా నేతల ఆగ్రహం

Lokesh on jangareddygudem deaths: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని.. తెదేపా నేతలు మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలపై లోకేశ్‌ ఆధ్వర్యంలో.. తెదేపా నేతలు రెండో రోజు నిరసన చేపట్టారు.

Lokesh and tdp leaders fires on YSRCP over jangareddygudem deaths
కల్తీసారా తాగి 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదు: తెదేపా
author img

By

Published : Mar 15, 2022, 11:10 AM IST

Lokesh on jangareddygudem deaths: నాటుసారా మరణాలపై లోకేశ్‌ ఆధ్వర్యంలో.. తెదేపా నేతలు రెండో రోజు నిరసన చేపట్టారు. నకిలీ బ్రాండ్ల భాగోతం వెలికి తీయాలంటూ మండిపడ్డారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు.

నాటుసారా మరణాలు సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు.

ఇదీ చదవండి:

కల్తీసారా మృతుల కుటుంబాలతో పూర్తైన రహస్య విచారణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.