ETV Bharat / city

ప్రైవేట్ ట్రావెల్స్ పై కరోనా దెబ్బ - ప్రైవేట్ ట్రావెల్స్ పై లాక్డౌన్ ప్రభావం

కరోనా దెబ్బకు ప్రైవేటు ట్రావెల్స్ రంగం కుదేలైంది. 45రోజులుగా బస్సులు షెడ్లకే పరిమితం అయ్యాయి. ఎప్పుడు రోడ్డెక్కుతాయో అర్థంకాని పరిస్థితుల్లో.. ట్రావెల్స్ రంగంపై ఆధారపడిన కుటుంబాల బతుకు భారమైంది.

lockdown effect on private travels
ప్రైవేట్ ట్రావెల్స్ పై లాక్డౌన్ ప్రభావం
author img

By

Published : May 5, 2020, 8:52 AM IST

ప్రైవేట్ ట్రావెల్స్ పై లాక్డౌన్ ప్రభావం

రాష్ట్రంలో దాదాపు రెండున్నర వేల బస్సులు... ప్రైవేటు రంగంలో ఉండగా.. వీటిపై ఆధారపడి 35వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరోనా అలజడితో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బస్సులు నడవకపోయినా.. పర్మిట్‌లు, పన్నులు, బ్యాంకు ఈఎంఐలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయకపోతే.. బస్సులు నడపడం కష్టమంటున్నారు. టోల్ గేట్ల మినహాయంపు, పన్ను రాయితీ కల్పించాలని... కోరుతున్నారు.

ప్రైవేటు బస్సు యాజమాన్యాలనేకాదు.. వాటిని నమ్ముకున్న దాదాపు 20కిపైగా రంగాల వారినీ కరోనా దెబ్బతీసింది. డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లతోపాటు.. మెకానిక్‌లు, టింకరింగ్ పనిచేసే వాళ్లూ ......ఇలా చిన్నా చితక పనులతో కుటుంబాల్ని నెట్టుకొచ్చేవారి ఉపాధికీ గండి పడింది. ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధారపడి... రాష్ట్రంలోని ప్రధాన రహదార్లు వెంట ఉండే అనేక గ్రామాల్లో టికెట్ బుకింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో సీటు బుకింగ్ మీద వచ్చే కమిషన్లపైనే వీరు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు వారందరి ఆదాయాల్నీ కరోనా దెబ్బకొట్టింది.

లాక్డౌన్ తర్వాత కూడా నిలదొక్కుకోవడం చాలా కష్టమని,. ట్రావెల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. బస్సుల్లో భౌతికదూరం పాటించడం మంచిదే అయినా... ఆక్యుపెన్సీపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యాసంస్థలు, వివిధ కంపెనీలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుంచి రోజూ తీసుకువెళ్లే బస్సులు.... రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు వారందరి పరిస్థితీ దుర్భరంగా మారింది.

ఇదీ చదవండి : లాక్​డౌన్​ భగీరథులు: బోర్ కొట్టి బావులు తవ్వేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.