కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే వంశీని వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు అడ్డుకున్నారు. మల్లవల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. వంశీ వేదిక వద్దకు వెళ్లకుండానే వైకాపాలోని ఓ వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో మల్లవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: