ETV Bharat / city

వైకాపా కొత్త అధ్యక్షుల జాబిత విడుదల.. మంత్రి రోజాకు దక్కని ఛాన్స్​ - వైకాపా కొత్త అధ్యక్షుల జాబిత మంత్రి రోజాకు దక్కని అవకాశం

New Presidents: వైకాపా అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ.. అధికార పార్టీ కొత్త జాబితను విడుదల చేసింది. మంత్రి రోజా, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మరికొంత మందికి ఈ జాబితాలో అవకాశం దక్కలేదు.

List of new presidents of ysrcp
వైకాపా కొత్త అధ్యక్షుల జాబిత విడుదల
author img

By

Published : Jun 29, 2022, 10:29 AM IST

New Presidents for YSRCP affiliate unions: వైకాపా అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ.. అధికార పార్టీ కొత్త జాబితను విడుదల చేసింది. మంత్రి రోజా, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మరికొంత మందికి ఈ జాబితాలో అవకాశం దక్కలేదు. మహిళా విభాగం బాధ్యత నుంచి రోజాను తప్పించి.. గతేడాది తెదేపా నుంచి.. వైకాపాలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీతకు అప్పగించారు. యువజన విభాగం అధ్యక్ష బాధ్యత నుంచి రాజాను తొలగించి.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డికి ఇచ్చారు.

ఎస్టీ విభాగాన్ని.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నుంచి తీసేశారు. ఈ విభాగాన్ని కొండప్రాంతం, మైదాన ప్రాంతమని రెండుగా చేసి వెంకటలక్ష్మి, ఎం.హనుమంత నాయకులకు అప్పగించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్రసాదరాజును తొలగించి ఆ పదవిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.

సేవాదళ్ అధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించి.. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ ఎండీ రుహల్లాకు కట్టబెట్టారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి, శివభారత్ రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో.. శివభారత్ రెడ్డిని డాక్టర్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.