ETV Bharat / city

తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం జోరు - సరిహద్దు జిల్లాలో మద్యం జోరు

ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతానికి పైగా మద్యం ధరల పెరుగుదలతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో 16శాతం మాత్రమే ధరలు పెరగ్గా.. పెద్ద ఎత్తున మద్యం ఏపీకి తరలుతోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 40శాతం మేర అదనంగా మద్యం అమ్ముడుపోయింది.

liquor-sales-increase-in-border-districts-of-telangana

author img

By

Published : Jun 13, 2020, 11:47 AM IST

కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో మద్యం విక్రయాల జోరు తగ్గలేదు. గత నెలలో అమ్మకాలు జరిగిన 26 రోజుల్లో రూ.2,770 కోట్ల విక్రయాలు జరగ్గా.. ఈ నెలలో శుక్రవారం(12వ తేదీ) వరకు రూ.900 కోట్లకు పైబడి లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాల సమయం రెండు గంటలు పెంచడం, రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా మద్యం తరలిపోతున్న నేపథ్యంలో విక్రయాలు మరింత ఊపందుకున్నాయి.

రాజధానిలో..

16శాతం మద్యం ధరలు పెరిగినప్పటికీ హైదరాబాద్‌ జిల్లాలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో గత ఏడాది ఇదే సమయంలో రూ.77.57 కోట్ల మేర విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో రూ.83.63 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూన్‌లో 12వ తేదీ వరకు రూ.82.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా... ఈ ఏడాది అదే సమయంలో ఏకంగా రూ.175.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.

ఏపీకి పెద్ద ఎత్తున..

ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్​లోకి మద్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలుతోంది. ఏపీలో మద్యంపై 70శాతానికిపైగా ధరలు పెంచడం, రాష్ట్రంలో కేవలం 16శాతం మాత్రమే ధరలు పెరగిన తరుణంలో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.71 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అదే సమయంలో రూ.105 కోట్ల మద్యం అమ్ముడు పోయింది.

రూ.30 కోట్లకు తగ్గకుండా..

మహబూబ్‌నగర్‌ గతేడాది రూ.45కోట్ల మద్యం అమ్ముడు పోగా... ఈ ఏడాది రూ.75.72 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది రూ.41.12 కోట్ల మద్యం అమ్ముడుపోగా...ఈ ఏడాది రూ.73 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు సరిహద్దు జిల్లాల నుంచి కూడా ఒక్కో జిల్లాలో రూ.30 కోట్లకు తక్కువ కాకుండ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

అక్కడలా..ఇక్కడిలా..

హైదరాబాద్‌లో వలసకార్మికులు తగ్గిపోవడం, కరోనా కష్టాలతో యువత మద్యానికి దూరంగా ఉన్నందునే అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లో ఆశించిన స్థాయిలో మద్యం అమ్ముడుపోక దుకాణదారులు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సరిహద్దులోని రాష్ట్ర మండలాల్లో మద్యం దుకాణదారులు అమ్మకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: గుంటూరు జీజీహెచ్‌కు మాజీమంత్రి అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.