ETV Bharat / city

రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేత! - విద్యుత్ తాజా వార్తలు

రాష్ట్రంలోని పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై విధించిన పరిమితులను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్
పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్
author img

By

Published : May 18, 2022, 4:44 PM IST

రాష్ట్రంలో పరిశ్రమలు వినియోగించే విద్యుత్​పై విధించిన పరిమితులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్​కు అనుగుణంగా పరిశ్రమలు ఇవాళ్టి నుంచి విద్యుత్​ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. విద్యుత్ కొరత కారణంగా ఇప్పటి వరకూ 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి మాత్రమే అనుమతించిన డిస్కమ్​లు.. ఇక నుంచి పూర్తిస్థాయిలో వంద శాతం మేర విద్యుత్​ను వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇక నుంచి పరిశ్రమలపై విద్యుత్ పరిమితులు ఏమీ ఉండబోవని ఏపీ ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్​లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తాయని ప్రభుత్వం తెలియచేసింది.

ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేసింది. 50 శాతం విద్యుత్ వినియోగాన్ని 70 శాతానికి పెంచారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గటం, బహిరంగ మార్కెట్​లో విద్యుత్ అందుబాటులోకి రావటంతో పరిశ్రమలకు పూర్తిస్థాయి విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు పెరుగుతున్నట్లు ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఏపీ జెన్​కో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు టెండర్లు పిలిచిందని మొత్తం 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు ఇంధనశాఖ తెలియచేసింది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.