విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడలో వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు.లాక్ డౌన్ వేళ ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుతగిలారు. బందర్ రోడ్డు రంగా సెంటర్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేశారు. ఇరు పార్టీల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కష్టకాలంలో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం అన్యాయయమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. లాక్‌డౌన్ తర్వాత కూడా విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని సీపీఎం నేత మధు వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక పస్తులు ఉంటున్నారని...ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అమానుషమన్నారు.
అనుమతి లేదు : పోలీసులు
విజయవాడలో సెక్షన్ 30, 44 అమలులో ఉందని పోలీసులు తెలిపారు.ముందస్తు అనుమతి లేకుండా ఆందోళనలు, నిరసనలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :