ETV Bharat / city

chandrababu: రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు: చంద్రబాబు

author img

By

Published : Sep 17, 2021, 4:35 AM IST

జగన్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాతంగా లేరని తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి అంతటి బాధ్యత లేని ముఖ్యమంత్రీ ఇప్పటివరకు లేరని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ రేటు 3శాతం నుంచి 16శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్న యువతపై రేప్ కేసులు పెట్టడం దారుణమన్నారు.

CBN WITH YOUTH LEADERS at Vijayawada
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత.. ఇలా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు, నిరుద్యోగులతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరుద్యోగులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వస్తే 2.36 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్‌ మాట ఇచ్చి తప్పారని, దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. ముఖ్యమంత్రి తీరుతో రాష్ట్రంలో ప్రజలకు పనుల్లేవని, యువతకు ఉద్యోగాలు లేవని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు.

‘ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్‌ బూటకం. రాజధాని అమరావతిని జగన్‌ నిలిపేయడంతో పరిశ్రమలు రాలేదు. వేలాది ఉద్యోగాలు పోయాయి. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే జగన్‌ తీరు వల్ల అవి వెనక్కి మళ్లాయి. దీంతో 30 లక్షల ఉద్యోగాలను కోల్పోయాం. పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడుతున్నారు. నిరుద్యోగిత రేటు 3.6 నుంచి 16 శాతానికి పెరిగింది. నిరుద్యోగులు ఉద్యమిస్తే అరెస్టు చేస్తున్నారు.. అత్యాచారం కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. వీటన్నింటిపై చట్టసభలో పోరాడతాం’ అని చంద్రబాబు తెలిపారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు లెనిన్‌బాబు, సూర్యారావు, ఏపీఎస్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌, రవిచంద్ర మాట్లాడారు.

ఇదీ చదవండి..

SEC: హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల ఫలితాలపై ఎస్‌ఈసీ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.