'ఒక్క అవకాశం ఇవ్వండి' న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తానని అధికారం చేపట్టిన జగన్... ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారత న్యాయవాదుల సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. విజయవాడలో భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్‌కు బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జూనియర్ న్యాయవాదులకు గత 4 నెలల స్టైఫండ్ ఇవ్వాలని, ఆరోగ్య కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అజయ్ కుమార్ కోరారు. ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి : చిత్రంలో విచిత్రం: వైకాపా నేతల ఫ్లెక్సీలో 'ఎన్టీఆర్ అభివాదం'