ETV Bharat / city

Ts corona cases: తెలంగాణలో కొత్తగా 578 కరోనా కేసులు, 5 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 578 మందికి కొవిడ్​ నిర్ధరణ కాగా.. ముగ్గురు మరణించారు.

telangana
తెలంగాణలో కొత్తగా 578 కరోనా కేసులు
author img

By

Published : Jul 18, 2021, 8:44 PM IST

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90 వేల 966 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 578 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,36,627 కి చేరింది. మరో ముగ్గురు వైరస్​ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3వేల 759గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 5 లక్షల 29వేల 888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 731 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,23,044 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల 824 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.86 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 86,409 మందికి కొవిడ్​ పరీక్షలు చేయగా ప్రైవేట్​ ఆస్పత్రుల్లో 4,557 మందికి పరీక్షలు చేయించుకున్నారు.

జిల్లాల వారీగా...

జీహెచ్​ఎంసీ పరిధిలో 75 నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో​ 53, ఖమ్మం 43, సూర్యాపేట 38, వరంగల్​ అర్బన్​, మంచిర్యాల జిల్లాల్లో 36 చొప్పున కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి 32, నల్గొండ 25, మేడ్చల్​ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాలో 21 చొప్పున పాజిటివ్​ నిర్ధరణ అయింది. రంగారెడ్డి 16, వరంగల్​ రూరల్​ 16, జయశంకర్​ భూపాలపల్లి 16, రాజన్న సిరిసిల్ల 15, మహబూబాబాద్​ 15, భద్రాద్రి కొత్తగూడెం 14, మహబూబ్​నగర్​ 14, జనగామ 13, సిద్దిపేట 12, ములుగు 10, సంగారెడ్డి 9, వనపర్తి 9, నిజామాబాద్​, నాగర్​ కర్నూల్​ జిల్లాలో 7 చొప్పున కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి.

యాదాద్రి భువనగిరి 6, మెదక్​ 5, ఆదిలాబాద్​ 5, జోగులాంబ గద్వాల 3, వికారాబాద్ 3, నిర్మల్​ 2, నారాయణపేట జిల్లాలో 1 చొప్పున పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి:

AP Corona Cases: కొత్తగా 2,974 కరోనా కేసులు, 17 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.