ETV Bharat / city

'రీసర్వే పనులకు అవసమైన పరికరాలను సమకూర్చండి' - land resurvey steering committee

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి.. సచివాలయంలో రాష్ట్ర స్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం ఉన్నత స్దాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందని ఆయన తెలిపారు.

land resurvey
land resurvey
author img

By

Published : Aug 19, 2021, 11:01 PM IST

భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. రీసర్వే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. సచివాలయంలో రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. డ్రోన్లు, రోవర్స్ సమీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించారని వివరించారు. కీలకమైన సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వేగంగా పనులు చేసే క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకోనున్నామని చెప్పారు. మరోవైపు గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన సాఫ్ట్​వేర్​ను సమకూర్చుకోవాలని కమిటీ చైర్మన్ అజమ్ కల్లాం ఆదేశించారు. తాడేపల్లి గూడెంలో నిర్వహిస్తున్న అర్బన్ సర్వే పైలెట్ ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని.. త్వరితగతిన ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి:

e-kyc: వాలంటీర్‌, రేషన్ డీలర్ల వద్దే ఈ-కేవైసీ నమోదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్

CM JAGAN: ఎమ్మెల్యే రమేష్​ బాబు కుమారుడి పెళ్లికి సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.