జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే హైదరాబాద్కు రూ. లక్ష కోట్ల ప్యాకేజీ ఇప్పిస్తామని ప్రధాని మోదీతో చెప్పించినట్లయితే... తాము కూడా అందరికీ మోదీ గొప్పతనం చెప్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని జలవిహార్లో క్రిస్టియన్ల సభకు ఆయన హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నిజమైన హిందువని, కాబట్టే ఆయన మిగతా మతాలను అగౌరవపరిచారని అన్నారు. అయితే కొన్ని పార్టీలకు ఎన్నికల సమయంలో మతం గుర్తొస్తుందని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు...
తాగి వాహనం నడపండి, తప్పుడు మార్గంలో వాహనం నడపండని కొన్ని పార్టీలు చెబుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్రం ఒక్క జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఐఐఎమ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లాంటి వాటిని ఎప్పటి నుంచో అడుగుతున్నాకేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. నగరంలో బాబర్, బిన్ లాడెన్ల గురించి మాట్లాడుతున్నారని, ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరని సమాధానమిచ్చారు. విషయం లేని వాళ్లు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్కు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.