ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇన్ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని విడుదల చేశారు. ఏలూరు కాలువకు, రైవస్ కాలవలకు మాత్రమే ప్రస్తుతానికి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల తెలియజేశారు. బందరు కాలువ, కేఈబీ కెనాల్‌కు మరమ్మతులు జరుగుతున్నందున... వీటికి ఈ నెలాఖరకు నీరు అందిస్తామని తెలిపారు. వర్షాలు పడటం వల్ల ప్రకాశం బ్యారేజీకు భారీగా నీరు వస్తుండటంతో పాటుగా 13 మోటార్లు పనిచేస్తుండటం వల్ల గోదారి నీరు బ్యారేజీకి చేరుతోందని అధికారులు తెలియజేశారు.
ఇదీ చదవండి : విజయవాడలో కృష్ణా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం