లాక్డౌన్తో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురిని శ్రామిక్ రైళ్లలో తరలించగా... మరో నాలుగు వేల మందిని తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా నగరంలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నగదు చెల్లింపు, సాధారణ... ఇలా రెండు రకాల క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజుల పాటు ఉంచిన తర్వాత వారిని సొంత ప్రాంతాలకు పంపిస్తామని కృష్ణా సంయుక్త కలెక్టర్ మాధవీలత చెప్పారు. వలస కూలీల తరలింపుపై సంయుక్త కలెక్టర్ మాధవీలతతో మా ప్రతినిధి ముఖాముఖి..!
ఇవీ చదవండి...