ETV Bharat / city

కృష్ణా జిల్లాలో తెదేపాకు పూర్వవైభవం తీసుకువస్తాం : నెట్టెం రఘురాం - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లాలో తెదేపాకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నేతలంతా కలిసి పనిచేస్తామని విజయవాడ పార్లమెంట్​ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్​.. పార్టీ సమీక్షా సమావేశంలో తెదేపా నేతలు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలపై చర్చించారు.

నెట్టెం రఘురాం
నెట్టెం రఘురాం
author img

By

Published : Oct 9, 2020, 4:34 PM IST

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్.. పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశంలో చర్చించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి గల కారణాలు చర్చించామని, అనేక అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు పార్లమెంట్ ఇన్​ఛార్జ్​ నెట్టెం రఘురాం తెలిపారు.

జిల్లాలో తెలుగుదేశానికి 40 శాతం ఓటింగ్ వచ్చిందని నెట్టెం రఘురాం గుర్తుచేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ పార్లమెంట్​కి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. నేతలందరూ కలిసి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి ఏపీ పాలిసెట్- 2020 ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.