రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కొండపల్లి కోట ఒకటి. విజయవాడ సమీపంలోని ఈ ఖిల్లాకు శతాబ్దాల చరిత్ర ఉంది. సాధారణ రోజుల్లో ఇక్కడి విశేషాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ పర్యాటకులు వచ్చేవారు. ఏడాదిన్నరగా కరోనా విజృంభణతో ఇక్కడ సందడికి బ్రేక్ పడింది. తొలి దశ అనంతరం కొన్ని రోజులు పర్యాటకులను అనుమతించినా.. రెండోదశ దెబ్బకు మరోసారి మూసివేశారు. జూన్ 22 నుంచి పర్యాటక ప్రదేశాల్లో నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వటంతో.. పర్యాటకులు కోటకు క్యూ కడుతున్నారు.
ఇన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన తమకు కోట తెరవడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ ప్రశాంతత లభిస్తోందని పర్యాటకులు అంటున్నారు. గతంతో పోలిస్తే కోట ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని.. సోలార్ దీపాల ఏర్పాటు ఆకట్టుకుంటోందని పర్యాటకులు అంటున్నారు.
ఇదీ చదవండి: