రాజ్యాంగ వ్యవస్థలపై నోరు పారేసుకోవటం వైకాపా నాయకులకు వ్యసనంలా మారిందని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. ఎస్ఈసీకి సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయి సజ్జలకు లేదని పేర్కొన్నారు. నిమ్మగడ్డకి సలహాలు ఇవ్వటం మాని బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్, సాయిరెడ్డిలకు ఇచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్ఈసీపై విమర్శలు చేయడం తగదన్నారు. సజ్జలకు ఏపీ పంచాయతీ యాక్ట్ తెలుసా..? అని ప్రశ్నించారు.
తెదేపా అధికారంలోకి రాగానే 100 గజాల్లో 3 లక్షలతో ఇల్లు కట్టిస్తాం అని మేనిఫెస్టోలో హామీ ఇస్తే.. వైకాపాకు ఉలుకెందుకని ధ్వజమెత్తారు. ఐఏఎస్‌గా చేయకూడని పనులు ప్రవీణ్ ప్రకాష్ చేశారని ఆరోపించారు. నిమ్మగడ్డ పేరును ఎస్ఈసీగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సు చేయలేదని చెప్పారు. అప్పటి గవర్నర్ నరసింహన్ నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమించారని వెల్లడించారు.
ఇదీచదవండి