తెదేపాపై కొడాలి నాని విమర్శలు జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్‌లో పెడతానని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. సన్న బియ్యం ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు... దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో తెదేపా ఎప్పుడైనా... అధిక సీట్లు సాధించినట్లైతే రాజకీయాల నుంచి వెళ్లిపోతానన్నారు. దేవినేని అవినాష్ వైకాపా చేరారని... వల్లభనేని వంశీ ఇంకా చేరలేదని వివరించారు. తెదేపా విధానాలు నచ్చకనే వారు పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. నాలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొడాలి నాని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ అందరివాడు: వెల్లంపల్లి