ముఖ్యమంత్రి జగన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన కిషన్‌రెడ్డి దంపతులకు.. జగన్ - భారతి దంపతులు స్వాగతం పలికి సన్మానించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా విజయవాడకు చేరుకున్న కిషన్‌రెడ్డి.. జగన్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.
కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, భారతి దంపతులు సన్మానించారు. కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి.. నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...
kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి
cm jagan on Fake Challan Scam: ఏసీబీ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?: జగన్