విజయవాడ కరెన్సీ నగరంలో కియా మెటార్స్ వారు నూతనంగా ఆథరైజ్డ్ డీలర్ షోరూం ఏర్పాటు చేశారు. దీనిని కియా మోటార్స్ ప్రాంతీయ మేనేజర్ గౌరవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని టెస్ట్ డ్రైవ్ కోసం ఉంచిన కియా సెల్టోస్ కారుని ఆసక్తిగా తిలకించారు. కియా కార్లకు అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా మంచి మార్కెట్ ఉందన్నారు. ఇప్పటికే తమకు వినియోగదారుల నుండి బుకింగ్ కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో అన్ని రకాల మోడల్స్ కార్లను విజయవాడలో అందుబాటులో ఉంచనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి