రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే వైకాపా లక్ష్యమని తెదేపా నాయకురాలు కేశినేని శ్వేత ఆరోపించారు. అందులో భాగంగానే అచ్చెన్నాయుడు, ప్రభాకర రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారని మండిపడ్డారు. తెదేపా నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కు ఆమె వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో వైకాపా రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలలో కోతలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలను కట్టడి చేయకపోతే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని...రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధిచెబుతారన్నారు.