వలస కార్మికులకు విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత చెప్పులు, మాస్కులు, అల్పాహారం అందించారు. విజయవాడ రామవరప్పాడు కూడలిలో సుదూర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరిన వందమందికి పైగా వలస కూలీలకు శ్వేత అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్వేత విచారం వ్యక్తం చేశారు. తమ వంతు సాయంగా మరికొన్ని రోజులు సహాయం అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి : కార్మికులకు ఇది కష్టకాలం- సర్కారే ఆదుకోవాలి