తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకు వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకురాలు కేశినేని శ్వేత ఆరోపించారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అత్యవసర పనులు ఆగిపోయాయని ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడగా.. వారు వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.
పనులు ప్రారంభించబోయే పటమట యాదవుల బజార్, దానయ్య బజార్ ,కరణం గారి బజార్లను వారు పరిశీలించారు. డివిజన్లలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్యెల్యే తెలిపారు.