బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి దివ్యాశీర్వచనాలతోపాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేసవి సెలవులు కావడంతో దుర్గమ్మ సన్నిధి భక్తులతో కళకళలాడుతోంది. వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీచదవండి