ETV Bharat / city

జగన్‌ ప్రభుత్వంపై కేశినేని నాని విమర్శలు..

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. అమరావతిని ప్రపంచానికే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారని... రాష్ట్రానికి, దేశానికి ఆర్థిక శక్తిగా తయారు చేసేందుకు.. ప్రణాళికలు రచిస్తే జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.

Kashineni Nani criticizes Jagan government
జగన్‌ ప్రభుత్వంపై కేశినేని నాని విమర్శలు..
author img

By

Published : Dec 18, 2020, 11:53 AM IST

దుర్మార్గుడిని కోరుకుంటే ఎంత నష్టమో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని.. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్​పై విమర్శలు గుప్పించారు. అమరావతిని ప్రపంచానికే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపించారు. రాష్ట్రానికి, దేశానికి ఆర్థిక శక్తిగా తయారు చేసేందుకు.. ప్రణాళికలు రచిస్తే జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.

గుప్పెడు ఇసుక ఇవ్వలేని జగన్ మూడు రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. మెజార్టీ ఎంపీలు ఇస్తే.. కేంద్రం మెడలు వంచుతానాన్న జగన్.. మోదీ, అమిత్‌షా కాళ్లపై పడుతున్నారని దుయ్యబట్టారు. లాలూచీ, స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ దిల్లీ పర్యటనలు అని నాని ఆరోపించారు. ఆస్తి పన్ను పెంపు వల్ల ఎంత నష్టమో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పథకాన్ని ఆర్భాటంగా ప్రకటిస్తూ 90శాతం మందికి కోత విధిస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన భోగస్ ముఖ్యమంత్రి జగన్‌ అని కేశినేని నాని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

ఆందోళనలతో దద్దరిల్లిన దివీస్‌ ఫార్మా పరిశ్రమ ప్రాంగణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.