సంస్కారవంతమైన భాష గురించి వైకాపా నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. నారా లోకేశ్ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మాట్లాడటం చూస్తే అలాగే అనిపిస్తోందని విమర్శించారు. భాష, నాగరికతల గురించి మాట్లాడే హక్కు విజయసాయిరెడ్డికి, వైకాపా నేతలకు లేదన్నారు. సూటుకేసులు తరలించే అలవాటు తెదేపాకు లేదని తెలిపారు.
ఇదీ చదవండి: హత్యకు సుపారీ, గొడ్డలివేట్లు మీ ఇంటివే కదా.. ఇప్పుడేం రాస్తారు? : లోకేశ్