తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. ఘటనలో శాంతిభద్రతల వైఫల్యం కనిపించిందన్నారు. దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు.
చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేదు. తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని వివరించాం. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం. ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితి వివరిస్తాం. -కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా రాజ్యసభ సభ్యుడు
ఇదీ చదవండి