ETV Bharat / city

Kalava: 'జల వివాదాలపై ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు' - కాలవ శ్రీనివాసులు న్యూస్

కావాలని జల వివాదాన్ని సృష్టించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల రక్షకులుగా నటిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ నాటకం ఆడుతున్నారని అన్నారు. ప్రజల్ని మోసగించే చర్యలకు స్వస్తి పలికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొల్పిన కృత్రిమ వివాదాలకు చెక్ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

kalava srinivasulu comments on water dispute
జల వివాదాలపై ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు
author img

By

Published : Jul 15, 2021, 7:23 PM IST

జల వివాదాలపై ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు

కృష్ణా జల వివాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ నాటకం ఆడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో నేతలు మండిపడ్డారు. నీటి సమస్యపై ఇద్దరివీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని మండిపడ్డారు. జల వివాదాలపై ఇద్దరు సీఎంలు కుమ్మక్కై.. రాత్రి ఫోన్‌లో మాట్లాడుకుని ఉదయం సవాళ్లు విసురుకుంటున్నారని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆక్షేపించారు. జల వివాదాలపై చంద్రబాబు స్పందించటం లేదనటం సరికాదన్నారు. రాష్ట్రానికి సీఎం జగనా? లేక చంద్రబాబా ? అని నిలదీశారు.

జలవివాదాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ వివాదంపై ఇద్దరు సీఎంలు చర్చించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదు? లేఖలు రాస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఉపాధిహామీ బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఉపాధి పనులు చేసినవాళ్లు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాలా? కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయట్లేదు. కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. పాత బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కాలవ శ్రీనివాసులు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

లేని వివాదాన్ని కావాలని సృష్టించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల రక్షకులుగా నటిస్తున్నారని కాలవ దుయ్యబట్టారు. సున్నితమైన అంశాన్ని సుహృద్భావ వాతావరణంలో ఎందుకు చర్చించుకోవట్లేదని నిలదీశారు. ప్రజల్ని మోసగించే చర్యలకు స్వస్తి పలికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొల్పిన కృత్రిమ వివాదాలకు చెక్ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.