విశాఖ నగరానికి మరణ శాసనం లిఖిస్తున్నారని కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు విశాఖ నగర ప్రతిష్టను మసక బారుస్తున్నారన్నారు. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన విశాఖను భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారని విమర్శించారు. పులివెందుల ఫ్యాక్షన్ చరిత్ర గల వ్యక్తులకు విశాఖలో ఏం పని అని కళా నిలదీశారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసినా... పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. విశాఖ దందాలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ప్రమాదాలపై పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ని సార్లు సమీక్షించారని ఆక్షేపించారు.
పరిశ్రమల ప్రమాదాల్లో మరణించిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడు నెలల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారన్న కళా..దశాబ్దాల విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ప్రమాదాలెందుకని ప్రశ్నించారు. హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ కూలిన ఘటన బాధాకరమని కళా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విశాఖ హెచ్ఎస్ఎల్లో ఘోర ప్రమాదం...11 మంది మృతి