ETV Bharat / city

దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలి: కళా వెంకట్రావు

దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు డిమాండ్ ‌చేశారు. పాలకమండళ్ల సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల ప్రతిష్టను పథకం ప్రకారం వైకాపా మంటగలుపుతోందని కళా వెంకట్రావు విమర్శించారు.

Kala Venkat Rao Demands Durga temple Governing Body Cancel
కళా వెంకట్రావు
author img

By

Published : Oct 1, 2020, 3:49 PM IST

దుర్గగుడి సభ్యురాలు చుక్కా నాగవెంకట వరలక్ష్మి కారులో మద్యం లభించడం.. వైకాపా దోపిడీ విధానాలకు పరాకాష్ట అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల పాలకమండళ్ల సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని డిమాండ్ ‌చేశారు. మంత్రి కనుసన్నల్లోనే పాలకమండలి సభ్యులు పనిచేస్తున్న మాట వాస్తవం కాదా అని కళా వెంకట్రావు నిలదీశారు.

రాజీనామా చేయాల్సింది బోర్డు సభ్యురాలు కాదు.. ముందు నైతిక బాధ్యతగా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ‌చేశారు. రాజకీయ విమర్శలపై చూపుతున్న శ్రద్ధ.. దేవాలయాల పటిష్టతపై చూపడంలేదని విమర్శించారు. అక్రమ మద్యం ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేవాలయాల ప్రతిష్టను పథకం ప్రకారం వైకాపా మంటగలుపుతోందని కళా వెంకట్రావు విమర్శించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.