ETV Bharat / city

'జస్టిస్ రమణ విద్యార్థి దశలోనే ప్రజా సమస్యలపై దృష్టి సారించేవారు' - జస్టిస్ రమణ న్యూస్

విద్యార్థి సంఘాల్లో జస్టిస్ ఎన్‌.వి.రమణ చురుగ్గా పాల్గొనేవారని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. విద్యార్థి దశలోనే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టేవారని చెప్పారు.

justice ramana friends comments over student life
జస్టిస్ రమణ విద్యార్థి దశలోనే ప్రజా సమస్యలపై దృష్టి సారించేవారు
author img

By

Published : Apr 6, 2021, 4:15 PM IST

జస్టిస్ రమణ విద్యార్థి దశలోనే ప్రజా సమస్యలపై దృష్టి సారించేవారు

జస్టిస్ ఎన్​.వి రమణ విద్యార్థి దశలోనే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టేవారని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్ధి సంఘాల్లో జస్టిస్ రమణ చురుగ్గా పనిచేశారని... సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఎప్పుడూ కాంక్షించేవారని తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదగటం గర్వకారణమన్నారు. న్యాయవ్యవస్థలో మరింత అభివృద్ధి వస్తుందని రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

గర్వంగా ఉంది

జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులుకావటంపై ఆయనతో విద్యాభ్యాసం పూర్తి చేసిన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ సర్వోన్నత పీఠాన్ని తమ స్నేహితుడు అధిరోహించనుండటం గార్వకారణంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.