పేదలందరికీ సొంతిళ్లు నిర్మించటమే తన లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు కట్టించే బాధ్యతను సీఎం జగన్ తనపై ఉంచారని అన్నారు. విశాఖలో లక్షమంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమంపై తొలిసంతకం చేసినట్టు మంత్రి వివరించారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు కోర్టులకు వెళ్లారని ఆరోపించారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం 90 బస్తాల సిమెంటు మాత్రమే ఇచ్చేవారని ఇక నుంచి 140 సిమెంటు బస్తాలు ఇవ్వనున్నట్లు మంత్రి రమేశ్ వెల్లడించారు.
"31 లక్షల మందికి ఇళ్లు కట్టించే బాధ్యత సీఎం నాపై ఉంచారు. అందరూ ఇళ్లలో గృహప్రవేశం చేయాలన్నదే నా లక్ష్యం. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు కోర్టులకు వెళ్లారు. విశాఖలో లక్షమంది పేదలకు ఇళ్లు కట్టించే దస్త్రంపై తొలి సంతకం చేశా." - జోగి రమేశ్, గృహనిర్మాణ శాఖ మంత్రి
ఇదీ చదవండి: నాది పోటీ సభ కాదు.. అధిష్టానం వద్దనలేదు : మాజీమంత్రి అనిల్