కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థకు స్టాంప్ డ్యూటీ రద్దు, కాంప్లెక్స్ పరిసరాల అభివృధి కోసం 3 కోట్లు కేటాయించడం అన్యాయమని జనసేన(janseena) విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేశ్ విమర్శించారు. ప్రభుత్వం జీవో. నెం.61ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీఓను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వారి బినామీల లాభం కోసం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచరుకు రాయితీలు ప్రకటించటం అన్యాయమని.. దీనిలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి 50వేల చదరపు. అడుగులు లంచంగా ఇస్తున్నారని ఆరోపించారు. జీవో 61 రాష్ట్ర మంత్రుల కోసమే గానీ ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఈ ఆరోపణలు తప్పు ఐతే వచ్చే శుక్రవారం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణానికి మంత్రి వెలంపల్లి రావాలని పోతిన మహేశ్ సవాలు విసిరారు.
ఇదీ చదవండి: