విజయవాడ ప్రాంతంలో రాజధాని వద్దంటున్న వైకాపా ప్రజాప్రతినిధులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావడానికి అనర్హులని జనసేన అధికార ప్రతినిథి పోతిన మహేశ్ అన్నారు. వైకాపా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు 'కనకదుర్గ ఫ్లైఓవర్ వద్దు-రోడ్డు వైడనింగ్ ముద్దు' అంటూ ఉద్యమించిన వారు.. నేడు ప్రారంభోత్సవానికి ఎలా వచ్చారని నిలదీశారు.
పైవంతెనకు ఇరువైపులా మట్టి పనులు చేయడానికి 16 నెలల సమయం తీసుకున్న ప్రభుత్వ నేతలు.. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. వారి తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కనకదుర్గ పైవంతెన పూర్తిచేసిన ఘనత భాజపాకు, కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విజయవాడ రాజధాని ప్రాంతం అయినందునే ఫ్లైఓవర్ కల సాకారమైందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ