Janasena on Amul: రాష్ట్రంలో పాల సహకార రంగాన్ని నాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతినమహేష్ మండిపడ్డారు. సహకార రంగాన్ని పాడి రైతులను ఎందుకు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో చెప్పాలన్నారు.
పాడి రైతులు ఎవరికి పాలు పోయాలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో పాడి రైతులను ఆదుకోవాలిసింది పోయి గుజరాత్ వారిని ఆదుకోవడంలో ఆంతర్యం ఏమిటని? నిలదీశారు.
ఒక లీటర్ పాలకి రాష్ట్రంలో ఎవ్వరూ చెల్లించలేని నగదు అమూల్ చెల్లిస్తుందని జగన్ అబద్ధాలు చెబుతున్నారని పోతిన ఆరోపించారు. అమూల్ సంస్థకు పాలు పోయాలని కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. విజయ మిల్క్ యూనియన్లో సుమారు ఒక లక్ష యాభై వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారని, వారిని వీధిన పడేయడానికి ప్రభుత్వం పన్నాగం చేస్తోందన్నారు.
విజయ డెయిరీ కంటే అమూల్ ఒక రూపాయి యాభై పైసలు తక్కువ చెల్లిస్తుందని ఆరోపించారు. కరోనా కష్ట సమయంలో కూడా పని చేసి ప్రజలను కార్మికులను ఆదుకున్న సంస్థ విజయ మిల్క్ యూనియన్ అన్నారు.
ఇదీ చదవండి: KANNABABU: 'అమూల్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే తప్పేంటి'