జనసేన పార్టీ పొలిట్‌బ్యూరోను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయాలకు పొలిట్‌బ్యూరో కీలకంగా వ్యవహరించనుంది. ఇందులో సభ్యులుగా నలుగురిని నియమించారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్‌రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్‌లను ఎంపిక చేశారు.
అలాగే 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని జనసేనాని ప్రకటించారు. దీనికి ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్ వ్యవహరించనున్నారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో పాటు.. పవన్ సోదరుడు నాగబాబు, తోట చంద్రశేఖర్, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్ ఉంటారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను ఎంపిక చేసినట్లు అధినేత సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో అన్ని స్థాయిల్లో కమిటీలు వేయాలని పవన్ నిర్ణయించారు. ఆ మేరకు ఇవాళ కీలకమైన రెండు విభాగాల్ని పవన్ ఖరారు చేశారు.
ఇదీ చదవండి :