"బీసీలను ఓటు బ్యాంకుగా, జెండాలు మోసే కూలీలుగా చూస్తున్న సీఎం జగన్పై ఆ వర్గం తిరుగుబాటు తప్పదు" అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతంie ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి.. సుమారు 20 వేల మంది బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాలరాశారంటూ మండిపడ్డారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కేవలం ఆ వర్గం దృష్టి మరల్చేందుకే ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ బీసీల ద్రోహా లేదా బంధువా అన్నది.. బీసీలే తేల్చుకోవాలన్నారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై హక్కుల పోరాట నాయకుడు ఆర్.కృష్ణయ్య పోరాడాలని సూచించారు. ఈబీసీ రిజర్వేషన్ 10 శాతం అమలు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో ముఖ్యమంత్రి చెప్పాలని మహేష్ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తుండగా.. రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. "మీ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ అన్యాయాలను ఎదిరించి జనసేన పోరాడుతూనే ఉంటుంది" అన్నారు.
ఇదీ చదవండి: