ETV Bharat / city

'అసలు దోషిని విచారించకుంటే దర్యాప్తు ఎప్పటికీ పూర్తి కాదు' - మంత్రి వెల్లంపల్లిని విమర్శించిన జనసేన నేత పోతిన మహేష్ న్యూస్

దుర్గ గుడిలో మాయమైన మూడు సింహాలకు.. మంత్రి వెల్లంపల్లికి విడదీయరాని బంధం ఉందని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. మంత్రి చెప్పిన కట్టు కథలని పోలీస్ శాఖ కొనసాగిస్తోందని విమర్శించారు.

Janasena party leader Pothina Mahesh criticizes Minister Vellampally Srinivas
'అసలు దోషిని విచారించకుంటే దర్యాప్తు ఎప్పటికీ పూర్తి కాదు'
author img

By

Published : Jan 21, 2021, 7:56 PM IST

దుర్గ గుడిలో మాయమైన మూడు సింహాల కేసు విషయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన కట్టు కథలని పోలీస్ శాఖ కొనసాగిస్తోందని జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జీ పోతిన మహేష్ విమర్శించారు. అసలు దోషిని విచారించకుంటే దర్యాప్తు ఎప్పటికీ పూర్తి కాదని స్పష్టం చేశారు.

దుర్గ గుడిలో మాయమైన మూడు సింహాలకు వెల్లంపల్లికి విడదీయరాని బంధం ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీస్ శాఖ లీకులు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. కేసును పక్కదారి పట్టించడానికే నకిలీ దొంగలను విచారిస్తున్నారన్నారు. దేవాలయాలపై దాడులు ఘటనలో ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కానీ, దోషిని కానీ.. శిక్షించలేదని దుయ్యబట్టారు. దీంతో పోలీసులపై ప్రజలకున్న నమ్మకం పోతుందని మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'కళా వెంకట్రావును పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లటం అమానుషం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.