స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి ఆ ఎన్నికల్లో గెలిచి వైకాపా పాలన పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వయంగా తనకు, తన కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించమని కేంద్రాన్ని కోరిన పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో డీజీపీ అర్థం చేసుకోవాలని అన్నారు.
ఇదీ చదవండి: